Rs 7 crore
-
రూ.7వేల కోట్లు రుణాలు రద్దు చేసిన SBI
-
సన్యాసి అంత్యక్రియలకు కోట్ల ఖర్చు
ముంబయి: తమ మతానికి చెందిన సన్యాసి అంత్యక్రియలకోసం దేశీయంగా ఇతర దేశాల్లో ఉన్న జైనుల కమ్యూనిటీ ఏకంగా రూ.ఏడు కోట్లు పోగేసింది. వేలం నిర్వహించి మరీ ఈ మొత్తాన్ని కూడగట్టింది. అంత్యక్రియల సందర్భంగా జరిపే 25 కార్యాక్రమాలకు వేలం నిర్వహించారు. ఇందులో ఆయన పాదాలను ప్రత్యేకంగా శుభ్రం చేసే క్రతువు కూడా ఉంది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని రాజ్ ఘర్ అనే చిన్నపట్టణంలో శ్రీ మద్విజయ్ రవీంద్రసురి మహారాజ్సాహేబ్జి(62) గతవారం కన్నుమూశారు. దీంతో ఆయన అంత్యక్రియలు ఘనంగా నిర్వహించాలని వేలం నిర్వహించారు. ఇందులో ఆయన దేహానికి స్నానం చేయించడం, హారతి కార్యక్రమంవంటి కార్యక్రమాలకు వేలం నిర్వహించగా ఒక్కొక్కరు ఒక్కో కార్యక్రమాన్ని దక్కించుకున్నారు. తమ కమ్యూనిటీకి చెందిన సన్యాసిలకు ఈ విధంగా సేవ చేసుకునే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తామని చెప్పారు. దుబాయ్ కు చెందిన జయేశ్ బాయ్ అనే వ్యక్తి అత్యధికంగా రూ.68 లక్షలు చెల్లించి తొలి కార్యక్రమాన్ని దక్కించుకున్నాడు. -
అద్వానీ ఆస్తుల విలువ రూ. 7 కోట్లు
గాంధీనగర్: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీకి దాదాపు ఏడు కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయి. అద్వానీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఈ ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌తో పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన శనివారం నామినేషన్ దాఖలు చేశారు. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో 3.5 కోట్ల రూపాయిల విలువైన ఆస్తులు ఉన్నాయని, ఐదేళ్లలో వీటి విలువ రెట్టింపు అయ్యిందని అద్వానీ పేర్కొన్నారు. గుర్గావ్లో రెండు ఇళ్లు, గాంధీనగర్‌లో ఓ ఇల్లు ఉన్నాయని తెలిపారు. వీటి విలువ 5.57 కోట్ల రూపాయిలుగా చూపారు. అద్వానీ పేరిట 97.23 లక్షలు, ఆయన భార్య పేరిట 67.13 లక్షల రూపాయిల బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయని వెల్లడించారు. 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నాయని పేర్కొన్నారు. అద్వానీ దగ్గర 25 వేలు, భార్య దగ్గర 15 వేలు నగదు ఉందని తెలిపారు. తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని అద్వానీ తెలిపారు. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్నట్టు పేర్కొన్నారు.