జాబ్ ఇంటర్వ్యూ అనగానే అభ్యర్థుల్లో ఏదో తెలియని బెరుకు మొదలవుతుంది. అదో భయపెట్టే భూతంలాగా భావిస్తుంటారు. కానీ, ముందుగా సన్నద్ధమై, ఆత్మవిశ్వాసం పెంచుకుంటే మౌఖిక పరీక్షను ఎదుర్కోవడం సులభమే. ఇంటర్వ్యూలో ఉభయపక్షాల భాగస్వామ్యం ఉంటుంది. ఈ పరీక్ష మీకే కాదు కంపెనీకీ కూడా అవసరమే. మీకు ఉద్యోగం కావాలి, సంస్థకు మంచి ఉద్యోగి కావాలి. కాబట్టి మీరు భయపడడం అన వసరం. ముందస్తు సన్నద్ధత, ఆత్మవిశ్వాసం.. ఈ రెండింటితో ఎలాంటి ఇంటర్వ్యూలోనైనా జయకేతనం ఎగరేయొచ్చు.
కామన్ ప్రశ్నలు: ఇంటర్వ్యూలో అడగబోయే అన్ని ప్రశ్నలను ఎవరూ ఊహించలేరు. కానీ, సాధారణంగా అన్ని మౌఖిక పరీక్షల్లో అడిగే కొన్ని కామన్ ప్రశ్నలు ఉంటాయి. వాటికి సరైన సమాధా నాలను సిద్ధం చేసుకుంటే యుద్ధంలో సగం గెలుపు ఖాయమైనట్లే. తెలిసిన విషయాలను ఇంటర్వ్యూ లో పూర్తిఆత్మవిశ్వాసంతో చెబితే సానుకూలమైన ఫలితం కచ్చితంగా ఉంటుంది. కరిక్యులమ్ విటే (సీవీ)లో రాసిన అన్ని అంశాలపై మీకు పట్టు ఉండాలి. సీవీని ఎక్కువసార్లు చదువుకోవాలి. అందులో ప్రస్తావించిన అంశాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నలను సంధిస్తారు. విద్యాభ్యాసం, పాత యాజ మాన్యం గురించి అడుగుతారు. సీవీకి సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా బదులిచ్చేలా ఉండాలి.
కనీసం నటించండి: మీలో ఆత్మవిశ్వాసం తగుపాళ్లలో లేకపోవచ్చు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు ఇంటర్వ్యూలో నటించండి. మీ శరీరభాష దానికి తగ్గట్లుగా ఉండాలి. దీనివల్ల రిక్రూటర్‌పై సానుకూల ప్రభావం కలిగించొచ్చు. వంగిపోయినట్లుగా కాకుండా కుర్చీలో నిటారుగా కూర్చోండి. రిక్రూటర్ కళ్లలోకి నేరుగా చూస్తూ ధైర్యంగా మాట్లాడండి. ‘ఈ ఇంటర్వ్యూలో విఫలమైతే నాకు నష్టమేం లేదు’ అనే మైండ్‌సెట్‌ను అలవర్చుకుంటే ఒత్తిడి తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కంటినిండా నిద్ర: ఉదయాన్నే శరీరం, మనసు తాజాగా ఉండాలంటే రాత్రి కంటినిండా నిద్రపోవాలి. ఇంటర్వ్యూ కోసం ఆఖరి క్షణంలో ప్రిపరేషన్ ప్రారంభిస్తే కంగారు తప్పదు. విశ్రాంతి కూడా దొరకదు. కాబట్టి ముందుగానే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసుకొని ఇంటర్వ్యూ ముందురోజు రాత్రి హాయిగా నిద్రించండి. ఆలస్యంగా భోజనం చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇంటర్వ్యూలో ధరించాల్సిన దుస్తులు, బూట్లను ముందురోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి. మహిళలైతే తమ గోళ్ల రంగు(నెయిల్ పెయింట్)ను, ఎబ్బెట్టుగా ఉండే అలంకరణను తొలగించుకోవాలి.
సమయానికి చేరుకొనేలా: కారణాలు ఏవైనా కానివ్వండి.. మౌఖిక పరీక్షకు ఆలస్యంగా హాజరుకావడం ఎంతమాత్రం సరికాదు. ఇంటి నుంచి ఇంటర్వ్యూ కార్యాలయం వరకు ప్రయాణించడం ప్రయాసతో కూడుకున్నదే. దూర ప్రయాణమైతే అలసిపోతారు. ఇంటి నుంచి కార్యాలయం ఎంత దూరంలో ఉంది? అక్కడికి చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఎప్పుడు బయల్దేరాలి? వంటి విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. వీలైతే ఒకసారి అక్కడికి వెళ్లిరావడం మంచిది. దాని ప్రకారం ప్రణాళికను తయారు చేసుకోవచ్చు. ఆఖరి నిమిషంలో హడావుడిగా పరుగులు పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు.
ఉదయం వేళ మేలు:ఇంటర్వ్యూ కార్యాలయానికి చేరుకున్న తర్వాత మీ వంతు కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. అప్పుడు ఒక గ్లాస్ నీరు తాగండి. బిగ్గరగా ఊపిరి పీల్చుకోండి. విశ్రాంతి స్థితిలోకి రండి. గొంతులో గరగర లేకుండా చూసుకోండి. ఇంటర్వ్యూలో చెప్పబోయే సమాధానాలను మనసులో ఒకసారి మననం చేసుకోండి. మీ గురించి మీరు మనసులో చెప్పుకోండి. దీనివల్ల ఒత్తిడి మాయమవుతుంది. ఇంటర్వ్యూ ఏ సమయంలో నిర్వహించాలనేది కంపెనీ నిర్ణయమే. ఒక్కోసారి ఈ అవకాశం అభ్యర్థికే ఇస్తుంటారు. అలాంటప్పుడు ఉదయం వేళనే ఎంచుకోండి. ఎందుకంటే అప్పుడు వాతావరణం నిర్మలంగా ఉంటుంది. శరీరం, మనసు రిలాక్స్‌డ్‌గా ఉంటాయి. ఆ సమయంలో విజయావకాశాలు అధికం. ఒకవేళ మధ్యాహ్నం లేదా సాయంత్రమైతే అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి.
ఇంటర్వ్యూలో గెలుపునకు.. సన్నద్ధత, ఆత్మవిశ్వాసం!
Published Thu, Sep 11 2014 12:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్‌రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement