దరఖాస్తుల ఆహ్వానం

IIT Kharagpur Invites Applications For Kshitij Techno Fest - Sakshi

సాక్షి, నల్లగొండ: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో నిర్వహించనున్న క్షితిజ్‌ వార్షిక టెక్నో మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న తెలంగాణ ప్రాంత విద్యార్థులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2020 జనవరి 17 నుంచి జరిగే ఈ ఫెస్ట్‌కు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకొని పాల్గొనాల్సి ఉందన్నారు. సాంకేతిక రంగంలో ప్రముఖ దిగ్గజ కంపెనీలైన ఐబీఎం, మైక్రోసాఫ్ట్, గూగుల్‌ డెవలపర్స్‌ ఫర్‌గో, సెబీ లాంటి సంస్థలు వర్క్‌షాప్‌లో పాల్గొంటాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 70వేల మంది విద్యార్థులు పాల్గొంటారని, ఉత్తమ ప్రతిభ చూపిన సాంకేతిక అంశాలను ప్రదర్శించిన వారికి రూ. 50లక్షల బహుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఫెస్ట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం www.ktj.inలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top