ఆఖరి ఎత్తులు!

Chandrababu Naidu Election Stunts In AP Election Office - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని గంటల్లో పోలింగ్‌ జరగబోతున్నదనగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు యధావిధిగా తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించారు. బుధవారం అమరావతి లోని సచివాలయంలో ఉన్న ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి పోయి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీతో ఆయన ప్రవర్తించిన తీరు అందరినీ విస్మయపరిచింది. ఎన్నికల ప్రచారానికి గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసిపోయింది. ఆ తర్వాత ఏ నాయకుడూ ప్రచారానికి దిగకూడదు. ఎన్నికల నియమావళి ఇందుకు అంగీకరించదు.

కానీ చంద్రబాబు తాను అన్నిటికీ అతీతుడనని భావిస్తారు. అందుకే పదవీభ్రష్టత్వం ఖాయమని ఖరారైన చివరి నిమిషంలో కూడా దింపుడు కళ్లం ఆశతో ఏదో హడావుడి చేసి మీడియాకెక్కాలని తెగ తాపత్రయపడ్డారు. అందుకు ఏకంగా ఎన్నికల కమిషన్‌ కార్యాలయాన్నే ఆయన ఎంచుకున్నారు. ద్వివేదీతో అమర్యాద కరంగా ప్రవర్తించి అడ్డగోలుగా మాట్లాడారు. బెదిరింపులకు దిగారు. వేలు చూపిస్తూ స్వరం పెంచి ఆయన మాట్లాడిన తీరు అధికార యంత్రాంగాన్ని మాత్రమే కాదు... రాజకీయవర్గాలనూ, ప్రజ లనూ కూడా ఆశ్చర్యపరిచింది.

‘మీరు పోస్ట్‌మాన్‌ డ్యూటీ చేస్తారా... కేంద్ర ఎన్నికల సంఘం చెప్పి నట్టు ఎలా చేస్తారు?’ అంటూ బాబు ప్రశ్నించడం హాస్యాస్పదం. రాష్ట్ర ఎన్నికల సంఘం తన చెప్పు చేతల్లో నడవాలన్నది ఆయన ఉద్దేశం కాబోలు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడటం ఊహకందనిది. ఈ మాటల్లో కొత్తేమీ లేదు. గత కొన్నిరోజులుగా రోడ్‌ షోల్లో ఏకరువు పెడుతున్న ఆరోపణలే అవన్నీ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీని, ముగ్గురు ఎస్‌పీలను బదిలీ చేయడం ఆయనకు పరమ అభ్యంతరకరం. తాను ఏం చేసినా అన్ని వ్యవస్థలూ అచేతనంగా ఉండిపోవాలని ఆయన భావిస్తున్నారు.

ఏ పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) బదిలీ చేసింది? ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, మరికొందరు పోలీస్‌ అధికారులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వారిలో ముగ్గురిపై చర్య తీసుకుంది. కానీ ఆ చర్యను వమ్ము చేసి తనకు అత్యంత ప్రీతి పాత్రుడైన వెంకటేశ్వరరావు బదిలీని ఆపాలని చంద్రబాబు ప్రయత్నించారు. అందుకోసం వరస బెట్టి జారీచేసిన మూడు జీవోలు బాబు మానసిక స్థితికి, ఆయన మార్క్‌ పాలనకూ అద్దం పడ తాయి. ఆ ముగ్గురు అధికారులనూ బదిలీ చేస్తూ ఒక జీవో, వారిలో కేవలం ఇద్దరిని మాత్రమే బదిలీ చేస్తూ మరో జీవో, ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ను మినహాయిస్తూ ఇంకొక జీవో విడుదల చేశారు. ఈ మూడు జీవోల మధ్యా కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉన్నదని, పైగా ఇందులో ఆఖరుగా విడుదలచేసిన జీవోను ఎన్నికల సంఘం చర్యను వమ్ము చేసేందుకు వీలుగా వెనకటి తేదీ నుంచి అమలయ్యేలా జారీ చేశారని గమనిం చుకుంటే బాబు సర్కారు అనైతికత ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.

చెప్పాలంటే ఈ జీవోల జారీలో ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ వాస్తవానికి పోస్ట్‌మాన్‌లా ప్రవర్తిం చారు. ఇష్టంగానో, అయిష్టంగానో బాబు అభీష్టాన్ని నెరవేర్చారు తప్ప నిబంధనలేం చెబుతు న్నాయో, తన కర్తవ్యమేమిటో గమనించుకోలేకపోయారు. అందువల్లే సీఈసీ ఆయనపై కూడా చర్య తీసుకోవాల్సి వచ్చింది. తనపై విరుచుకుపడుతున్న బాబును ఈ జీవోల సంగతేమిటని కెమెరాల సాక్షిగా ద్వివేదీ నిలదీసి ఉంటే ఏమయ్యేది? వీటన్నిటినీ పట్టించుకోకుండా ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర వహించాలా అని ప్రశ్నిస్తే బాబు పరువు ఏమయ్యేది? ఇక్కడ మరో ముఖ్య విషయం గమనించాలి. ఈ బదిలీలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో తాము జోక్యం చేసు కోలేమని హైకోర్టు తోసిపుచ్చింది. 

ఎన్నికల సంఘం పనితీరుపై ఏ పార్టీకైనా అసంతృప్తి ఉండటం తప్పేమీ కాదు. నియమావళిని సక్రమంగా అందరితో పాటించేలా చేయడంలో అది విఫలమవుతున్నదనో, ఉల్లంఘనలు జరుగు తున్నా పట్టించుకోవడంలేదనో ఆరోపించదల్చుకుంటే అందుకు తగిన ఆధారాలను అందించాలి. తగిన వేదికల వద్ద ఫిర్యాదు చేయాలి. దేశంలో అందరికన్నా తానే సీనియర్‌ రాజకీయవేత్తనని, తనకు అపార అనుభవమున్నదని తరచు చెప్పుకునే బాబుకు ఇలాంటి అంశాలు ఇంకా తెలియ లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనకు తెలియక కాదు. ఏ పనైనా ఆయన తెలిసే చేస్తారు. తెలుసుకునే చేస్తారు. ఎవరూ తనని గమనించరని, గమనించినా నిలదీయరని అపార విశ్వాసం. ఏ వ్యవస్థా తనను ప్రశ్నించదన్న ధీమా. అంతక్రితం తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడైనా, మూడేళ్లక్రితం తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను నోట్ల కట్టలు పంపి ప్రలోభపరచాలని ప్రయత్నించినప్పుడైనా ఆయన ఈ ధీమాతోనే బరితెగించారు. ఇప్పుడు యావత్తు అధికార యంత్రాంగాన్నీ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నది ఈ ధీమాతోనే!

నిజానికి షెడ్యూల్‌ ప్రకటించిననాటినుంచి బాబు య«థేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘిస్తున్నారు. తాను ఆపద్ధర్మ సీఎంనన్న సంగతి మరిచి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను పిలిపించుకుని మొబిలైజేషన్‌ అడ్వాన్సులకింద, నీరు–చెట్టు పథకం కింద నిధుల సంతర్పణ చేశారు. ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండే కలర్‌ ఫొటోలతో కూడిన జాబితాలనూ, పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి సొంత పార్టీ ప్రయోజనాలకు వినియోగించుకున్నారు. పలు జిల్లాల్లో పోలీసుల ద్వారా, తమ పార్టీ వారి ద్వారా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలనూ, కార్యకర్తలనూ బెదరగొట్టాలని చూస్తున్నారు. నిజానికి ఇలాంటి అంశాల్లో ఎన్నికల సంఘం కఠినంగా ఉండటం లేదన్న అసంతృప్తి అందరిలో ఉంది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతూ తమకేదో తీరని అన్యాయం జరిగిందని బాబు శోకాలు పెడుతున్నారు. ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికొచ్చిన ప్రజానీకాన్ని ఇలాంటి కపట నాటకాలు ఏమార్చలేవు. బాబు తన అప్రజాస్వామిక వైఖరికి స్వస్తి చెప్పి వ్యవస్థలను గౌరవించడం నేర్చుకోవాలి.

మరిన్ని వార్తలు

17-04-2019
Apr 17, 2019, 18:51 IST
సాక్షి, చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం ఎదురుచూస్తున్నారని తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థి బల్లి...
17-04-2019
Apr 17, 2019, 18:47 IST
విశాఖపట్నం: తెలుగు వారి అభ్యున్నతి కోసం పుట్టిన టీడీపీని నారా చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని వైఎస్సార్‌సీపీ నేత దాడి...
17-04-2019
Apr 17, 2019, 18:34 IST
వాళ్లంతా నన్ను చూడటానికి వస్తారు. కానీ పాపం మోదీకి ఎవరూ లేరుగా. అలాంటి వాళ్లకు కుటుంబాన్ని నడిపే విధానం ఎలా...
17-04-2019
Apr 17, 2019, 18:19 IST
విజయవాడ: విజయవాడ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ధనేకుల ఇంజనీరింగ్‌ కళాశాలలో భద్రత పర్చామని విజయవాడ...
17-04-2019
Apr 17, 2019, 17:47 IST
అమరావతి: గుంటూరు జిల్లా ఇనిమెట్లలోని 160వ పోలింగ్‌ స్టేషన్‌లోనికి ప్రవేశించి టీడీపీ నేత కోడెల శివ ప్రసాద్‌ చేసిన హైడ్రామాపై...
17-04-2019
Apr 17, 2019, 17:46 IST
సాక్షి, నెల్లూరు : టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే...
17-04-2019
Apr 17, 2019, 17:36 IST
‘బాటిల్‌ మంచినీరు 20 రూపాయలు. లీటరు పాలు 17, 18 రూపాయలా! ఇదెక్కడి అన్యాయం. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో వ్యాపారులు...
17-04-2019
Apr 17, 2019, 16:54 IST
న్యూఢిల్లీ : బీజేపీ ఇటీవల ప్రారంభించిన ‘నమో టీవీ’పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. పోలింగ్‌కు రెండు...
17-04-2019
Apr 17, 2019, 16:53 IST
పట్నా : జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ యువనేత కన్హయ్య కుమార్‌ కాన్వయ్‌ని బేగూసరాయి స్థానికులు అడ్డుకున్నారు....
17-04-2019
Apr 17, 2019, 16:30 IST
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక​ ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్‌ రేపు (గురువారం) జరుగనుంది. రెండో విడత...
17-04-2019
Apr 17, 2019, 16:25 IST
బెంగుళూరు: కర్ణాటకలో ఈసీ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల అధికారులు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలను కూడా వదిలిపెట్టకుండా తనిఖీలు...
17-04-2019
Apr 17, 2019, 16:23 IST
రాయ్‌పూర్‌ : రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ఛత్తీస్‌గడ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి కావాసి...
17-04-2019
Apr 17, 2019, 16:00 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 11న పోలింగ్‌ రోజు జరిగిన సంఘటనపై 13 జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర...
17-04-2019
Apr 17, 2019, 15:13 IST
సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతోందని, ఆయన రకరకాల ఆరోపణలు...
17-04-2019
Apr 17, 2019, 15:07 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన నోట్ల కట్టలు దొరికిన నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూరు నియోజకవర్గం ఎన్నికలు రద్దయిన...
17-04-2019
Apr 17, 2019, 14:46 IST
ఆ పార్టీ మ్యానిఫెస్టో కిక్కే వేరప్పా..
17-04-2019
Apr 17, 2019, 13:38 IST
రాహుల్‌ బీసీలను అవమానిస్తున్నారని మోదీ మండిపాటు
17-04-2019
Apr 17, 2019, 13:13 IST
నారా లోకేష్‌ బాబు మంగళగిరి అని పలుకలేకపోతున్నాడు.. తింగరి మంగళం లోకేష్‌..
17-04-2019
Apr 17, 2019, 12:25 IST
బెంగళూరు : ఇన్నాళ్లు అందానికి సంబంధించిన విమర్శలు కేవలం గ్లామర్‌ ఫీల్డ్‌లో మాత్రమే కనిపించేవి. కానీ ఈ సారి ఎన్నికల్లో...
17-04-2019
Apr 17, 2019, 12:15 IST
సాక్షి, నూజివీడు :  ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం.....
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top