ముస్లిం మైనార్టీలకు అండగా వైఎస్‌ఆర్‌సీపీ
ముస్లిం మైనార్టీలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు.
– పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ముస్లిం మైనార్టీలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. మంగళవారం రాత్రి పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో 7వ వార్డు నాయకులు నవీద్, ఉమర్, చాంద్‌బాషా, ఫజ్‌లు, అమానుల్లా, సద్దామ్, నదీమ్, దావూద్‌తో పాటు 200 మంది ముస్లిం మైనార్టీలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో గడ్డావీధిలో నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికలో ఎంపీ మాట్లాడుతూ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారనేందుకు చేరికలే నిదర్శనమన్నారు. చేయగలిగిందే చెబుదాం.. నమ్మిన ప్రజలను ఎప్పుడూ మోసం చేయకూడదని తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరచుగా చెబుతుంటారన్నారు. నీతి, నిజాయితీలే పునాదులుగా తమ పార్టీ ఆవిర్భవించిందన్నారు. నిరుపేదలకు అండగా నిలిచేందుకు మున్ముందు బ్యాంకర్లతో చర్చించి రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ ముస్లింలను టీడీపీ నాయకులు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప సముచిత స్థానం కల్పించడం లేదు. ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రహ్మాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జహీర్ అహ్మద్ ఖాన్.. రాష్ట్ర కార్యదర్శి గుండం ప్రకాశ్‌రెడ్డి, అసెంబ్లీ పరిశీలకుడు శీలారెడ్డి, కేడీసీసీబీ డైరెక్టర్ లోక్‌నాథ్, నాయకులు సి.హెచ్.మద్దయ్య, రఘు, నూరుల్లా ఖాద్రి, గోపినాథ్, సురేశ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
బాబుకు ప్రజా సంక్షేమం పట్టదు: గౌరు వెంకటరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్టదు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా సంక్షేమ పథకాల అమలులో ఘోరంగా విఫలమయ్యారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉంది.
వైఎస్‌ఆర్ పాలన స్వర్ణయుగం: బి.వై.రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన స్వర్ణయుగం. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. అడగకుండానే ముస్లింలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతోమంది పేద రోగులకు లక్షలాది రూపాయల విలువ చేసే ఆపరేషన్లు ఉచితంగా చేయించారు. మళ్లీ ఆ పాలన రావాలంటే వైఎస్ జగన్‌తోనే సాధ్యం.