ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో జరుగుతున్న భూదందాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షడు శంకర్ నారాయణ డిమాండ్ చేశారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో జరుగుతున్న భూదందాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో భూదందాపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూములు కోల్పోయిన నిరుపేదలు, రైతులకు న్యాయం చేయాలని కోరారు. రాజధాని పేరుతో చిన్నబాబు, పెద్దబాబుల అక్రమ భూదందాపై సీబీఐచే విచారణ జరిపించాలని శంకర్ నారాయణ డిమాండ్ చేశారు.