వైఎస్ఆర్సీపీ నేత దాతృత్వం.. | YSRCP leader kapu ram chandrareddy offering money to 200 eye surgeries | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీ నేత దాతృత్వం..

Sep 13 2015 3:46 PM | Updated on Jul 30 2018 6:12 PM

వైఎస్ఆర్సీపీ నేత దాతృత్వం.. - Sakshi

వైఎస్ఆర్సీపీ నేత దాతృత్వం..

ఒక్కరు.. ఇద్దరికి కాదు ఏకంగా 200 మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించడానికి ఓ నేత ముందుకొచ్చారు.

రాయదుర్గం: ఒక్కరు.. ఇద్దరికి కాదు ఏకంగా 200 మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించడానికి ఓ నేత ముందుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాపు రాంచంద్రారెడ్డి బెంగళూరుకు చెందిన శంకర్ కంటి ఆస్పత్రి వారి సహకారంతో ఆదివారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి వివిధ ప్రాంతాల నుంచి సుమారు 440 మందికి పైగా వచ్చారు. వీరందరికీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. 200 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేల్చారు. వీరందరికీ శంకర్ కంటి ఆస్పత్రిలో కాపు రాంచంద్రారెడ్డి సొంత ఖర్చుతో శస్త్రచికిత్సలు చేయించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement