breaking news
eye medical camp
-
రేపు కంటి వైద్య శిబిరం
ఆదిలాబాద్ రిమ్స్ : ఆదిలాబాద్ పట్టణంలోని విశ్రాంత సంఘ భవనంలో ఈనెల 18న కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. మహేంధ్రనాథ్, ఎస్. మోహన్‌రెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రబాద్‌లోని పుష్పగిరి ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు జరుగుతాయని, పెన్షనర్స్ అందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
వైఎస్ఆర్సీపీ నేత దాతృత్వం..
రాయదుర్గం: ఒక్కరు.. ఇద్దరికి కాదు ఏకంగా 200 మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించడానికి ఓ నేత ముందుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాపు రాంచంద్రారెడ్డి బెంగళూరుకు చెందిన శంకర్ కంటి ఆస్పత్రి వారి సహకారంతో ఆదివారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి వివిధ ప్రాంతాల నుంచి సుమారు 440 మందికి పైగా వచ్చారు. వీరందరికీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. 200 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేల్చారు. వీరందరికీ శంకర్ కంటి ఆస్పత్రిలో కాపు రాంచంద్రారెడ్డి సొంత ఖర్చుతో శస్త్రచికిత్సలు చేయించనున్నారు. -
సాక్షి కార్యాలయంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం!