చంద్రబాబు అనైతికతపై పోరుబాట | ysrcp fight against chandrababu Immorality | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అనైతికతపై పోరుబాట

Apr 9 2017 4:30 PM | Updated on Aug 9 2018 5:07 PM

చంద్రబాబు అనైతికతపై పోరుబాట - Sakshi

చంద్రబాబు అనైతికతపై పోరుబాట

రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న అనైతిక పాలనపై పోరాడుతామని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.

పులివెందుల : రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న అనైతిక పాలనపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గట్టిగా పోరాడుతామని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ అక్రమంగా సంపాదించిన  సొమ్ముతో నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బులు, కాంట్రాక్టులు, మంత్రి పదవులు ఎరగా చూపి టీడీపీలో చేర్చుకున్నారన్నారు.

ఎమ్మెల్యేల రాజీనామాలను  స్పీకర్‌ ఆమోదించకుండా  వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం నీచమైన చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు చేస్తున్న అనైతిక పాలనను రాష్ట్రపతి, ప్రధాన మంత్రిలతోపాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తెలియజేస్తామన్నారు.  తెలంగాణాలో టీడీపీకి చెందిన ఒకరు టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళితే  తప్పుబట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఏపీలో అదే పద్దతిని అవలంభించడం దారుణమన్నారు.  రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని చెప్పిన చంద్రబాబు.. అవినీతిబాటలో పయనిస్తున్నాడని   ఎద్దేవా చేశారు. అవినీతిలో రాష్ట్రం ఎంత ముందుందో కాగ్‌ నివేదిక ఇటీవల వెల్లడించడమే దీనికి నిదర్శనమన్నారు.   అనంతరం ప్రజా దర్బార్‌ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement