జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మహానంది మండలంలో పర్యటిస్తున్నారు.
నందీశ్వరుడికి వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు
Jan 10 2017 1:31 PM | Updated on Jul 25 2018 4:42 PM
మహానంది : కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మంగళవారం మహానంది మండలంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మహానందీశ్వరాలయాన్ని ఆయన సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన జగన్ ఆర్చకులు ఘనస్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర నేటికి ఆరో రోజుకు చేరిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement