పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ఖాజ బైపాస్ రోడ్డులో సోమవారం ప్రమాదం జరిగింది.
యలమంచిలిలో రోడ్డు ప్రమాదం
Aug 22 2016 11:37 AM | Updated on Sep 4 2017 10:24 AM
- యువకుడి మృతి
యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ఖాజ బైపాస్ రోడ్డులో సోమవారం ప్రమాదం జరిగింది. బైక్‌లపై వెళ్తున్న నలుగురు యువకులు ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్(23) అనే యువకుడు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్నేహితుడి పెళ్లి నిమిత్తం వీరంతా హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరికి బైక్‌లపై వచ్చారు. పెళ్లి ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఆటోను ఢీకొట్టారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement