బాధతో యువరైతు ఆత్మహత్య | Young farmer suicide in nalgonda district | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య

Aug 5 2015 12:20 PM | Updated on Oct 1 2018 2:36 PM

కాలం కలిసిరాక వేసిన విత్తనాలు మొలకెత్తక తెచ్చిన అప్పు తీర్చే దారి కనిపించకపోవడంతో.. ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

నల్లగొండ : కాలం కలిసిరాక వేసిన విత్తనాలు మొలకెత్తక తెచ్చిన అప్పు తీర్చే దారి కనిపించకపోవడంతో.. ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో బుధవారం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి రాజు (25) తనకు ఉన్న రెండెకరాలలో పత్తి పంట వేశాడు.

వర్షాలు లేక గింజలు మొలకెత్తకపోవడంతో.. అప్పులు ఎలా తీర్చాలో అర్ధంకాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. మృతుడు కొత్తపల్లి రాజుకు రెండు నెలల కిందటే వివాహం అయింది.

Advertisement
 
Advertisement
Advertisement