తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం ప్రకాశం బ్యారేజి వద్ద ఓ యువకుడు శనివారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశాడు. సీసీ కెమెరాల ద్వారా గమనించిన పోలీసులు యువకుడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
ప్రేమ విఫలమై ఆత్మహత్యాయత్నం
Dec 17 2016 9:17 PM | Updated on Sep 4 2017 10:58 PM
అప్రమత్తమై యువకుడిని కాపాడిన పోలీసులు
ప్రకాశం బ్యారేజి (తాడేపల్లి రూరల్): తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం ప్రకాశం బ్యారేజి వద్ద ఓ యువకుడు శనివారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశాడు. సీసీ కెమెరాల ద్వారా గమనించిన పోలీసులు యువకుడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అతని వివరాలు సేకరించగా...యువకుడు మంగళగిరికి చెందిన మాచర్ల రవితేజ అని, ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టు తెలిపాడు. పోలీసులు యువకునికి కౌన్సెలింగ్ చేసి తల్లిదండ్రులను పిలిపించి అప్పగించారు.
Advertisement
Advertisement