ఇది తెలుగు భాషకు ‘దగాది’ : యార్లగడ్డ | Yarlagadda comments on Telugu language | Sakshi
Sakshi News home page

ఇది తెలుగు భాషకు ‘దగాది’ : యార్లగడ్డ

Apr 9 2016 2:35 AM | Updated on Aug 10 2018 8:16 PM

ఇది తెలుగు భాషకు ‘దగాది’ : యార్లగడ్డ - Sakshi

ఇది తెలుగు భాషకు ‘దగాది’ : యార్లగడ్డ

‘‘తెలుగు ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవలసిన ఉగాది కాదిది.. తెలుగు భాషా సంస్కృతులకు జరుగుతున్న దగాది’’ అని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాజమహేంద్రవరం కల్చరల్: ‘‘తెలుగు ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవలసిన ఉగాది కాదిది.. తెలుగు భాషా సంస్కృతులకు జరుగుతున్న దగాది’’ అని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో శుక్రవారం ఆయన మండుటెండలో ‘ఆవేదన దీక్ష’ చేశారు.

కవులు, కళాకారుల కోసం తన ఎన్నికల ప్రణాళిలో టీడీపీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాని అమలుకూ అడుగు పడలేదన్నారు. చెన్నైలో పొట్టి శ్రీరాములు ప్రాణార్పణ చేసిన భవనంలో సాహిత్య కార్యక్రమాలకుసీఎంగా ఎన్టీ రామారావు ఏడాదికి రూ.లక్ష మంజూరు చేస్తే, వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిని రూ.2 లక్షలకు పెంచారని గుర్తుచేశారు. ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచుతామని ప్రస్తుత మంత్రులు హామీ ఇచ్చినా మూడేళ్లుగా బకాయిలే విడుదల కాలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement