ఘనంగా యల్లమ్మ విగ్రహ ప్రతిష్ట | yallamma renovation in basavanapalli | Sakshi
Sakshi News home page

ఘనంగా యల్లమ్మ విగ్రహ ప్రతిష్ట

Aug 29 2016 12:36 AM | Updated on Sep 4 2017 11:19 AM

ఘనంగా యల్లమ్మ విగ్రహ ప్రతిష్ట

ఘనంగా యల్లమ్మ విగ్రహ ప్రతిష్ట

మండలంలోని కె.బసవనపల్లి గ్రా మంలో నూతనంగా నిర్మించిన యల్లమ్మదేవి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు.

హిందూపురం రూరల్‌ : మండలంలోని కె.బసవనపల్లి గ్రా మంలో నూతనంగా నిర్మించిన యల్లమ్మదేవి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. ఉదయం యల్లమ్మదేవి ఆలయం ఎదుట చండీహోమం చే పట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అభిషేకార్చనలు, బలిహారణ, మహాపూర్ణహారతి, మహామంగళహారతి తదితర పూజ లు నిర్వహించారు. అనంతరం దేవతా విగ్రహాన్ని ప్రతిష్టించారు.

ఈ సందర్భంగా గ్రామంలో జ్యోతు ల మహోత్సవం చేపట్టారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్, మండల కన్వీనర్‌ బసిరెడ్డి తదితర నాయకులు అమ్మవారి ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement