మూడు జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలు | Working knowledge centers in three distic's | Sakshi
Sakshi News home page

మూడు జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలు

Apr 26 2016 2:56 AM | Updated on Aug 20 2018 9:16 PM

మూడు జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలు - Sakshi

మూడు జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలు

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో పరీక్షించి, వాటిపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు మూడు జిల్లాల్లో కృషి

మెదక్, ఆదిలాబాద్, ఖమ్మంలో ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో పరీక్షించి, వాటిపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు మూడు జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేం ద్రం నిర్ణయించింది. మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈ కేంద్రాలను నెలకొల్పాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) నిర్ణయించింది. ఒక్కో కేంద్రానికి ఐకార్ రూ.8 కోట్ల వరకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. ఆ జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలను ఎక్కడ నెలకొల్పాలన్న విషయంపై ఐదుగురు సభ్యుల ఐకార్ ప్రతి నిధి బృందం రాష్ర్టంలో పర్యటిస్తుంది.

కృషి విజ్ఞాన కేంద్రాలను ఎక్కడెక్కడ నెలకొల్పాలనే విషయంపై రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల అధికారులు ఎవరికివారు ప్రాంతాలను ప్రతిపాదిస్తున్నారు. వారి ప్రతిపాదనలు వేర్వేరుగా పరిశీలించాక ఐకార్ బృందం తుది నిర్ణ యం తీసుకుంటుంది. మంగళవారం ఐకార్ బృందం అశ్వారావుపేటలోని ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని పరిశీ లిస్తుంది. బృందంతో పాటు రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రతాప్, ఇతర అధికారులుంటారు. అనంతరం ఐకార్ బృందం మెదక్ జిల్లా సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిల్లోనూ పర్యటిస్తుంది.

 శాస్త్రవేత్తల పోస్టుల భర్తీ...
కృషి విజ్ఞాన కేంద్రాలను మూడు జిల్లాల్లో ఏర్పాటు చేశాక ఒక్కో కేంద్రంలో దాదాపు ఆరుగురు చొప్పున శాస్త్రవేత్తల పోస్టులతో పాటు ఇతర పోస్టులూ భర్తీ చేసే అవకాశముంది. ఐకార్ నుంచి ఆమోదం లభించాక రాష్ట్ర ప్రభుత్వం ఆయా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement