పవన్‌ను కల్పించాలని మహిళ దర్నా | woman protest in front of pawan house | Sakshi
Sakshi News home page

పవన్‌ను కల్పించాలని మహిళ దర్నా

Sep 30 2016 12:21 AM | Updated on Mar 22 2019 5:33 PM

రోడ్డుపై బైఠాయించిన జ్యోతి - Sakshi

రోడ్డుపై బైఠాయించిన జ్యోతి

సినీ హీరో పవన్‌కల్యాణ్‌ కార్యాలయం వద్ద న్యూసెన్స్‌ చేస్తున్న ఓ మహిళను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు

బంజారాహిల్స్‌: సినీ హీరో పవన్‌కల్యాణ్‌ కార్యాలయం వద్ద న్యూసెన్స్‌ చేస్తున్న ఓ మహిళను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... మణికొండ నివాసి మీసాల జ్యోతిరత్నకుమారి నాలుగు రో జులుగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.72 ప్రశాసన్ నగర్‌లో ఉన్న పవన్‌కల్యాణ్‌ కార్యాల యం వద్దకు వస్తోంది. తాను పవన్‌ను చూసేందుకు వచ్చానని, ఆయనను చూ పించాలని సెక్యూరిటీ గార్డులపై ఒత్తిడి తెస్తోంది.లోనికి అనుమతి లేదని చెప్పినా వినిపించుకోకుండా   అక్కడే    తచ్చాడు తోంది.

దీంతో సెక్యూరిటీ సిబ్బంది బుధవారం రాత్రి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా కానిస్టేబుల్‌ స్వప్న వెళ్లి.. జ్యోతిని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేయగా తాను పవన్‌ను చూస్తేగాని వెళ్లేదిలేదని భీష్మించింది. దీంతో ఆమెను తరలించడానికి యత్నిం చగా స్వప్నపై దాడి చేసి స్పల్పంగా గాయపర్చింది. అయినాసరే.. పోలీసులు సహనం కోల్పోకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలని జ్యోతిని కోరగా.... తనను బలవంతంగా పంపిస్తున్నారని  రోడ్డుపై బైఠాయించి హల్‌చల్‌ చేసింది.

2 గంటల హైడ్రామా తర్వాత  స్టేషన్‌కు తరలించా రు. న్యూసె¯Œ్స చేసి, విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసినందుకు ఐపీసీ 353 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించా రు. గతంలో జ్యోతి  హీరో మహేష్‌బాబు ఇంటి వద్ద కూడా ఇలాగే న్యూసెన్స్ చేసినట్టు పోలీసులు తెలిపారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement