బస్సు - లారీ ఢీ: మహిళ మృతి | woman died in road accident at bommala ramaram in nalgonda district | Sakshi
Sakshi News home page

బస్సు - లారీ ఢీ: మహిళ మృతి

Jul 23 2016 8:53 AM | Updated on Aug 30 2018 4:07 PM

బస్సు - లారీ ఢీ: మహిళ మృతి - Sakshi

బస్సు - లారీ ఢీ: మహిళ మృతి

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

నల్లగొండ: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపురం వద్ద శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హాజిపేట వెళ్తున్న క్రమంలో... సాయిధామం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.

దీంతో బస్సులో ఉన్న మహిళ (58) అందులోనే ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందింది.  మరో పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.  ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement