విశాఖపట్నంలోని క్వీన్ ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో స్వైన్‌ప్లూతో చికిత్స పొందుతున్న చినపార్వతి (35) అనే మహిళ ఆదివారం అర్ధరాత్రి మరణించింది.
విశాఖపట్నం : విశాఖపట్నంలోని క్వీన్ ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో స్వైన్‌ప్లూతో చికిత్స పొందుతున్న చినపార్వతి (35) అనే మహిళ ఆదివారం అర్ధరాత్రి మరణించింది. స్థానిక గణేశ్‌నగర్‌కు చెందిన చినపార్వతి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది. దాంతో ఆరు రోజుల క్రితం ఆమెను కుటుంబ సభ్యులు ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు స్వైన్‌ప్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ ఆదివారం అర్థరాత్రి మృతి చెందింది.