చెడు వ్యసనాలకు బానిసై, జల్సాలకు అప్పు దొరకలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మండలంలోని ఇస్కాల గ్రామంలో చోటు చేసుకుంది.
జల్సాలకు అప్పు దొరకలేదని..
Jan 6 2017 12:02 AM | Updated on Nov 6 2018 7:53 PM
ఇస్కాల (పాములపాడు): చెడు వ్యసనాలకు బానిసై, జల్సాలకు అప్పు దొరకలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మండలంలోని ఇస్కాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామనికి చెందిన కంసలి బాలకృష్ణ (36) గతంలో తనకున్న ఎకరా పొలం సాగు చేసేవాడు. ప్రస్తుతం పొలం కౌలుకు ఇచ్చాడు. అప్పటి నుంచి ఏ పని చేయకుండా చెడువ్యసనాలకు బానిసయ్యాడు. దాదాపు రూ.3లక్షల దాకా అప్పులు చేశాడు. కుటుంబీకులు, బంధువులు పలు మార్లు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మద్యం సేవించడం మానుకోమని చెప్పిన మార్పు కనబడలేదు. జల్సాలకు ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడం, బయట ఎక్కడ అప్పులు లభించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్త ఆత్మకూరుకు తరలించగా కోలుకోలేక గురువారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకరరెడ్డి తెలిపారు. మృతుడికి భార్య శివశంకరమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Advertisement
Advertisement