టీవీ పగిలిందన్న కోపంతో ఓ భర్త భార్యను చితకబాది ఆమె మృతికి కారణమయ్యాడు.
టీవీ పగిలిపోయిందని భార్య హత్య
Sep 7 2016 10:03 PM | Updated on Oct 17 2018 6:06 PM
పెద్దాపురం: టీవీ పగిలిందన్న కోపంతో ఓ భర్త భార్యను చితకబాది ఆమె మృతికి కారణమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలంలోని పాత పెద్దాపురానికి చెందిన ముక్కు సూర్యప్రకాశ్ కూలీ పనులు చేస్తుంటాడు. మూడేళ్ల క్రితం నిజామాబాద్‌కు పని కోసం వలస వచ్చి సంధ్య(20)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అనంతరం పాత పెద్దాపురానికి కాపురం మార్చారు. ప్రస్తుతం వీరికి రెండేళ్లు, ఏడాది వయసు కలిగిన కుమారులు ఉన్నారు.
ఇలా ఉండగా కొంతకాలం నుంచి వీరి మధ్య మనస్ఫర్థలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో టీవీ పగిలిపోవడంతో వీరి మధ్య ఘర్షణ జరిగింది. భార్యను భర్త చితకబాదడంతో ఆమె గాయాల పాలైంది. ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతిచెందింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సతీశ్ తెలిపారు.
Advertisement
Advertisement