సారంగాపూర్లో దారుణం | Wife and mother Poured Kerosene and set Fire on brother in law at sarangapur | Sakshi
Sakshi News home page

సారంగాపూర్లో దారుణం

Sep 18 2016 8:41 AM | Updated on Sep 4 2017 2:01 PM

కరీంనగర్ జిల్లా సారంగాపూర్లో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది.

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సారంగాపూర్లో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. భర్తపై భార్య, అత్త కిరోసిన్ పోసి నిప్పటించారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి సమీపంలోని వారు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... భార్యను ఆమె తల్లిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement