
అగ్రహారం సోసైటీపై విచారణ ఎప్పడు?
అగ్రహారం సొసైటీలో రూ. కోటీ 30 లక్షలకుపైగా భారీ కుంభకోణం జరిగిందన్న విషయాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. అందులో బాగంగా సొసైటీ అధ్యక్షుడు రాజీనామా చేశారు. నూతన అధ్యక్షుడు కూడా ఎన్నికయ్యారు. కానీ సోసైటీలో జరిగిన అవినీతిపై ఉన్నతాధికారులు కనీస విచారణ కూడా జరపక పోవడంపై రైతుల్లో, స్థానికుల్లోనూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఖాజీపేట:
అగ్రహారం సొసైటీలో రూ. కోటీ 30 లక్షలకుపైగా భారీ కుంభకోణం జరిగిందన్న విషయాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. అందులో బాగంగా సొసైటీ అధ్యక్షుడు రాజీనామా చేశారు. నూతన అధ్యక్షుడు కూడా ఎన్నికయ్యారు. కానీ సోసైటీలో జరిగిన అవినీతిపై ఉన్నతాధికారులు కనీస విచారణ కూడా జరపక పోవడంపై రైతుల్లో, స్థానికుల్లోనూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయి విచారణ జరిగితే ఎక్కడ తమగుట్టు బయటపడుతుందో అని విచారణ జరపడంలేదని రైతులు స్థానికుల అంటున్నారు.
పంపుల అక్రమాలపై మౌనం ఎందుకు?:
రైతులకు తైవాన్ పంపులు ఇవ్వాలని అధికారిక ఉత్తర్వులు లేవు. కానీ అనధికారికంగా రైతులకు ఉపయోగంలేని తైవాన్ పైపులు రైతులనెత్తిన బలవంతంగా రుద్ది సుమారు రూ. 70 లక్షలు దోచుకున్నారు. ప్రతిరైతూ నుంచి పంపులను రూ. 6,475 కొనుగోలు చేయించి రూ. కోటీ 60 లక్షలు కంపెనీకి సోసైటీవారు చెల్లించారు. ఇందులో ఎవరూ కీలక సూత్రధారి.? ఎవరెవరికీ భాగాలు ఉన్నాయి? ఇంత వ్యవహారం సొసైటీ అధ్యక్షుడు ఒక్కడే నడపడం సాధ్యమా? మరి అలాంటప్పడు ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. ఉన్నతాదికారులకు వాటాలు ఇచ్చామని సోసైటీ అధ్యక్షుడు పలువురి దగ్గర చెప్పారన్న విమర్ళలు ఉన్నాయి. విచరాణలో అక్రమం అనితేలితే రైతులు నష్టపోయిన సోమ్మును తిరిగి ఇప్పిస్తారా ? ఇలాంటి ప్రశ్నలను రైతులు గుప్పిస్తున్నారు. వాటికి అధికారులే సమాధానం చెప్పాలి.
రుణాల వాసూళ్లలోనూ..
బ్యాంకు నుంచి రైతులకు అందిన రుణాల్లోనూ భారీగా గోల్‌మాల్ జరిగిందన్న విమర్శలు అధికంగా ఉన్నాయి. ఇచ్చిన రుణాల్లోనూ రూ. 3నుంచి 6 వేలు వసూళ్లు చేశారు. అందులోనూ కొందరూ బ్రోకర్లు వసూళ్లలో కీలక పాత్ర వహించారు. రుణాల వసూళ్లలో ఎవ్వరెవరికి వాటాలున్నాయి, ఎవ్వరి వాటా ఎంత? నష్టపోయిన రైతులందరినీ విచారిస్తారా లేదా అని రైతులు అనుమానం వ్యక్తం చేసున్నారు.
విచారణ ఎప్పడు?
సొసైటీ అక్రమాలపై విచారణ ఇప్పటి వరకూ జరగక పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెలవు దినాలు అని అధికారులు కుంటిసాగులు చెబుతున్నా వారి పనితీరుపై తీవ్ర విమర్ళలకు దారితీస్తోంది. అసలు విచారణ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు సొసైటీ వారికి అధికారులు గడువు ఇచ్చారని, ఈలోగా అన్నిరికార్డులు సరిచేయాలని చెప్పడంతో రాత్రింబవళ్లు ఈ పనులకు సిబ్బంది కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.