చేపల వేటకు వెళ్లి..
చేపల వేటకు వెళ్లి ఒకరు మృత్యువాత పడగా మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం బండిఆత్మకూరు మండలం సంతజూటూరు పికప్ ఆనకట్ట వద్ద చోటు చేసుకుంది.
ఒకరు మృతి.. మరొకరు గల్లంతు
నంద్యాల/బండిఆత్మకూరు: చేపల వేటకు వెళ్లి ఒకరు మృత్యువాత పడగా మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం బండిఆత్మకూరు మండలం సంతజూటూరు పికప్ ఆనకట్ట వద్ద చోటు చేసుకుంది. నంద్యాల పట్ణణం నడిగడ్డ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షఫీ రియల్ ఎస్టేట్ వ్యాపారి. సోమవారం దేవనగర్‌లో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నిర్వహించిన జనచైతన్య యాత్రలో పాల్గొన్నాడు. తర్వాత మధ్యాహ్నం స్నేహితులు కొత్త వాహనాన్ని కొనుగోలు చేశామని, విందుకు ఆహ్వానించడంతో పికప్ ఆనకట్ట వద్దకు వెళ్లారు. విందు ఆరగించాక సరదాగా చేపలు పట్టుకోవడం ప్రారంభించాడు. ప్రమాదవశాత్తూ పికప్ ఆనకట్టలో పడిపోయాడు. స్నేహితుడు షఫీ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతుంటే తట్టుకోలేని అంజాద్(30) కాపాడటానికి దూకాడు. అయితే అప్పటికే షఫీ నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. నీటిలో కొట్టుమిట్టాడుతున్న ఆంజాద్‌ను అక్కడే ఉన్న కొంత మంది స్థానికులు కాపాడి ఒడ్డుపైకి తీసుకొచ్చి ప్రాణాలను కాపాడటానికి యత్నించాడు. కాని అంజాద్ కోలుకోలేక మృతి చెందాడు. సమాచారం అందగానే బండిఆత్మకూరు పోలీసులు గల్లంతైన షఫీ కోసం కేసీ కెనాల్ పరీవాహక ప్రాంతాల్లో గాలింపు చర్యలను చేపట్టారు. ఈ ఘటనతో నడిగడ్డ ప్రాంతంలో విషాదం నెలకొంది. మృతి చెందిన అంజాద్ ఫరూక్‌నగర్‌కు చెందిన వారు. డ్రైవర్‌గా జీవనం సాగించే ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గల్లంతైన షఫీకి ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. అంజాద్ మృతదేహన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.