కృష్ణ పుష్కరాలకు తెలుగు వెబ్‌ సెట్‌ రూపకల్పన | web site design for krishna pushkaralu | Sakshi
Sakshi News home page

కృష్ణ పుష్కరాలకు తెలుగు వెబ్‌ సెట్‌ రూపకల్పన

Aug 10 2016 10:19 PM | Updated on Sep 4 2017 8:43 AM

కృష్ణ పుష్కరాలకు తెలుగు వెబ్‌ సెట్‌ రూపకల్పన

కృష్ణ పుష్కరాలకు తెలుగు వెబ్‌ సెట్‌ రూపకల్పన

ఉంగుటూరు : పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం గ్రామానికి చెందిన తెలుగు వెబ్‌సెట్‌ రూపకర్త కొఠారి కిరణ్‌ ఇప్పటి వరకూ మాతృభాషపై 10పైనే వివిధ అంశాలపై వైబ్‌సెట్‌లు రూపొందించారు. ఈనెల 12వతేదీ నుంచి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాల వెబ్‌సైట్‌ను రూపొందించారు.

కృష్ణా పుష్కరాల ప్రాసస్త్యం, కృష్ణ వేణమ్మ చరిత్ర, నదీ పరీవాహక ప్రాంతంలో ఇరువైపులా ఉన్న పుణ్య క్షేత్రాలు, దర్శనీయ ప్రదేశాలు, పుష్కరఘాట్ల పూర్తి సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. పుష్కర సమయంలో పూజాధికారుల వివరాలు,సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు, విజయవాడ పట్టణ ముఖ్యమైన సమాచారం  ఇలా పుష్కర యాత్రికులకు కావాల్సిన సమస్త సమాచారాన్ని ఇక చోట గుది గుచ్ఛి తెలుగులో రూపొందించిన వెబ్‌సైట్‌ డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. కృష్ణవేణి పుష్కరాలు.కమ్‌లో కొఠారి  రవికిరణ్‌ పొందుపర్చారు. ఆయన తిరపలిలో జరిగిన ప్రపంచ  తెలుగు మహాసభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,అప్పటి తెలుగు భాష అధికార సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్‌ చేతుల మీదగా ప్రశంస పత్రాలను అందుకున్నారు. ఆంధ్రా బులిటెన్‌.కామ్‌లో ఎడిటర్‌గా కొంత కాలం పనిచేశారు. ప్రస్తుతం ఆయన స్వగ్రామైన ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం గ్రామంలో  మీ–సేవ కేంద్రం నిర్వహిస్తూ ఇప్పుడు కృష్ణ పుష్కరాల వెబ్‌సైట్‌ను రూపొందించారు
తెలుగు భాషపై మక్కువతోనే..  తెలుగు భాషపై మక్కువతోనే అందరికీ ఉపయోగపడే అంశాలపై వెబ్‌సైట్లు రూపొందించాను. చోడా కిట్స్‌. కామ్, ఆంధ్రా బులిటెన్‌.ఇన్, మా ఊరు. ఇన్ఫో,  వెస్ట్‌గోదావరి ఇన్ఫో.ఇన్‌ ప్రాచుర్యం పొందాయి. వీక్షకుల సంఖ్య పెరగటంతో  గూగుల్‌  నిర్వాహకులు ప్రతి నెల గౌరవ వేతనం పంపుతున్నారు. సెట్లను నిత్యం నవీకరిస్తూ (ఆప్‌డేట్‌) అంతర్జాతీయ వీక్షకులకు తాజా సమాచారం అందించేందుకు కృషి చేస్తున్నాను.  
కొఠారి  రవికిరణ్‌– ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం.
 
Advertisement
Advertisement