'కాపుల పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు' | We support for Kapu's fighting says by Ysrcp Leader Bhumana | Sakshi
Sakshi News home page

'కాపుల పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు'

Jan 19 2016 3:42 PM | Updated on Oct 3 2018 7:31 PM

'కాపుల పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు' - Sakshi

'కాపుల పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు'

ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే నెరవేర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాకినాడ: ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే నెరవేర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తునిలో కాపు గర్జన వేదిక వద్ద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కలిశారు.


ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ... కాపులు చేస్తున్న పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. చంద్రబాబు అధికారం చేపట్టి 20 నెలలు దాటుతున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాకుండా.... కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ నెల 31న తునిలో కాపు గర్జన సభ తలపెట్టిన విషయం తెలిసిందే.    
 

Advertisement
 
Advertisement
Advertisement