మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారమివ్వండి | visweswarareddy met jc laxmikantham | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారమివ్వండి

Oct 30 2016 1:33 AM | Updated on Oct 30 2018 5:12 PM

విడపనకల్లు మండలం డొనేకల్‌ గ్రామంలో గుత్తి–బెంగుళూరు జాతీయ రహదారి ఆనుకుని రైతుల భూములు ఉన్నాయని, వాటికి మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ను ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి కోరారు.

అనంతపురం అర్బన్‌ : విడపనకల్లు మండలం డొనేకల్‌ గ్రామంలో గుత్తి–బెంగుళూరు జాతీయ రహదారి ఆనుకుని రైతుల భూములు ఉన్నాయని, వాటికి మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ను ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి కోరారు. జాయింట్‌ కలెక్టర్‌ను శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కలిసి పరిహారం అంశంపై మాట్లాడారు. ఇళ్ల స్థలాల కోసం రైతుల భూముల విలువ బేసిక్‌ విలువ ఎకరాకు రూ.3.50 లక్షలుగా ధర ను నిర్ధారణ చేశారని తెలిపారు.

వాస్తవంగా ఇక్కడ మార్కెట్‌ విలువ ప్రకారం రూ.15 లక్షలు ఉందన్నారు. ప్రభుత్వం ఇక్కడి భూముల ధరలను తారతమ్యంగా నిర్ణయించిందని, దీని వల్ల రైతులు చాలా నష్టపోతారని చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు జేసీని కలిసిన వారిలో గడేకల్‌ సర్పంచ్‌ పంపావతి, ఎంపీటీసీలు ప్రసాద్, ఓబిలేసు, వైఎస్సార్‌సీపీ నాయకులు డొనేకల్‌ హనుమంతు, రమేశ్, సురేష్, శివ, నారాయణస్వామి, లాయర్‌ గోపాల్, లేపాక్షి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement