కాపు జాతిని వాడుకున్న రోజులు మరిచావా? | visakha kapu leaders takes on ganta srinivasa rao | Sakshi
Sakshi News home page

కాపు జాతిని వాడుకున్న రోజులు మరిచావా?

Jun 14 2016 1:57 PM | Updated on Sep 4 2017 2:28 AM

కాపు జాతిని వాడుకున్న రోజులు మరిచావా?

కాపు జాతిని వాడుకున్న రోజులు మరిచావా?

మంత్రి గంటా శ్రీనివాసరావు తీరుపై కాపు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావు తీరుపై కాపు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన కాపు సంఘాలు నాయకులు మంగళవారం మంత్రి గంటాతో చర్చలు జరిపేందుకు వెళ్లారు. వారితో చర్చలు జరిపేందుకు నిరాకరించిన మంత్రి తన వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాము ఏం చెబుతామో కనీసం వినిపించుకోకుండా వెళ్లిపోవడంపై కాపు నేతలు మండిపడ్డారు.

'నీకు ఆ హోదా ఎక్కడి నుంచి వచ్చింది' అంటూ విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షుడు తోట రాజీవ్ ప్రశ్నించారు. పదవుల కోసం మీటింగులు పెట్టి కాపు జాతిని వాడుకున్న రోజులు మరిచావా అని నిలదీశారు. కాగా, భీమిలి పర్యటనలోనూ కాపులపై మంత్రి గంటా అసనహనం వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్ల కోసం ఆమరణదీక్ష చేస్తున్న ముద్రగడకు సంఘీభావంగా జిల్లా వ్యాప్తంగా కాపు సంఘాలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement