పంచమి నుంచి చవితి వరకు.. | vinayaka chavithi uthsava details | Sakshi
Sakshi News home page

పంచమి నుంచి చవితి వరకు..

Aug 25 2017 12:37 AM | Updated on Jun 1 2018 8:39 PM

పంచమి నుంచి చవితి వరకు.. - Sakshi

పంచమి నుంచి చవితి వరకు..

వినాయక చవితి...సంవత్సరానికి ఒక్కసారే వచ్చే పండుగైనా సంవత్సరమంతా గుర్తుండేలా ఎవరికి వారు ఉత్సవాలు నిర్వహిస్తారు.

వినాయక చవితి...సంవత్సరానికి ఒక్కసారే వచ్చే పండుగైనా సంవత్సరమంతా గుర్తుండేలా ఎవరికి వారు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే అనంతపురం సప్తగిరి సర్కిల్‌లోని వినాయక చౌక్‌లో ప్రతిష్టించే గణపతికి విశేష ప్రాముఖ్యం ఉంది. అందుకే ఇక్కడే చేసే ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ నెల 12న పంచమి రోజున భూమిపూజతో ప్రారంభమైన పనులు 25వ తేదీ చవితి నాటికి పూర్తయ్యాయి.

ఆగస్టు 12 : చవితి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతపురం నగర మేయర్‌ స్వరూప, ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పరిచూరి రమేష్‌ ఆధ్వర్యంలో వినాయక చౌక్‌లో వేదపండితులు పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాల ప్రారంభానికి ప్రతీకగా కాషాయ జెండాను ఎగురవేశారు.

ఆగస్టు 17 : వినాయకచౌక్‌లో వేసే గణేష్‌ మంటపం నమూనా ఒక్కోసారి ఒక్కోరకంగా ఉంటుంది. ఈసారి రాజస్థాన్ నుంచి విచ్చేసిన కళాకారులు తమ నైపుణ్యంతో మంటపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే 17వ తేదీ నాటికి మంటపం ముఖ ద్వారం పనులు ప్రారంభించారు.

ఆగస్టు 19 : గణేష్‌ మంటపం కేఎస్‌ఆర్‌ బాలికల జూనియర్ కళాశాల నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ఉంటుంది. ముఖద్వారం నుంచి దాదాపుగా 100 మీటర్ల వరకు ఉండే మంటపంపై రేకులు వేయడంతో పాటు ముఖద్వారానికి ఓరూపు తీసుకువచ్చారు.

ఆగస్టు 22 : రాజస్థాన్‌లోని రణతంబోర్‌లోని ఆలయ నమూనాతో మంటపాన్ని ప్రారంభించిన కళాకారులు 22వ తేదీ నాటికి ముఖద్వారాన్ని చక్కగా తీర్చిదిద్దారు. మంటపం ఎదురుగా రెండు ఏనుగులు ఘీకారం చేస్తున్నట్లుగా అద్భుతంగా తీర్చిదిద్దారు. చుట్టప్రక్కల పరదాలను ఏర్పాటు కూడా పూర్తి చేశారు.

ఆగస్టు 23 : మంటపం ఏర్పాటు ఓ కొలిక్కి వచ్చింది. 23వ తేదీ బుధవారం నాటికి మంటపం పనులు పూర్యయ్యాయి. మంటపం లోపల విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అవసరమైన నమూనా కూడా పూర్తి చేశారు. మంటపం బయట, లోపల విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

ఆగస్టు 24 : పనులన్నీ పూర్తికాగా...విద్యుత్‌దీపాల వెలుగులో వినాయక చౌక్‌ కాంతులీనింది. సప్తగిరి సర్కిల్‌ నుంచి మంటపం వరకు విద్యుత్‌ దీపాలతో స్వాగత తోరణాలు...అమ్మవారి రూపాలను రూపొందించారు. మంటపం లోపల ‘గంగా–పార్వతీ సంవాదం’ పేరిట కదిలే విగ్రహాలను సిద్ధం చేశారు.

ఆగస్టు 25 : సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన మంటపంలో రణతంబోర్‌ ఆలయంలోని విగ్రహాన్ని పోలిన రీతిలోనే తయారు చేసిన స్వామివారి విగ్రహాన్ని తెల్లవారుజామున ప్రతిష్టించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించి..దర్శనానికి ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement