వీరేశ్వరుని బ్రహ్మోత్సవం | veereswara swamy brahmothsavam | Sakshi
Sakshi News home page

వీరేశ్వరుని బ్రహ్మోత్సవం

Apr 29 2017 11:53 PM | Updated on Sep 5 2017 9:59 AM

నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోన్న మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈపూజా కార్యక్రమం శైవాగమ పద్ధతిలో శైవాగమ పండిట్‌ స్వర్ణ

  • కన్నుల పండువగా ప్రారంభం
  • ఐ.పోలవరం : 
    నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోన్న మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు జరిగే  బ్రహ్మోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈపూజా కార్యక్రమం శైవాగమ పద్ధతిలో శైవాగమ పండిట్‌ స్వర్ణ రుద్రాక్ష కంకణ, స్వర్ణ సింహతలాట సన్మాన గ్రహీత యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వాముల పర్యవేక్షణలో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు.  ఆలయంలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, స్వామి వారికి అభిషేకం, స్వామి, అమ్మవారిని నూతన వధూవరూలను సంప్రదాయ పద్ధతిలో చేశారు. పండితులు, స్వామి, అమ్మవారికి అలంకరించే పట్టు వస్త్రాలను జంపన రామకృష్ణంరాజు దంపతులు అందించారు. గ్రామంలోని మహిళలు పసుపు కొమ్ములను రోకట్లో కొట్టి పసుపును తయారు చేశారు. అనంతరం పండితులు పంచామృతాలతో స్వామి, అమ్మవారికి స్నానాలు చేయించారు. అనంతరం సాయంత్రం అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన,  సాయంత్రం అయ్యవారిని, అమ్మవారిని భద్ర పీఠంపై ప్రత్యేక అలంకరణలో గ్రామోత్సవం  జరిగింది. అనంతరం ఎదురు సన్నాహం, స్వామివారిని ద్వాదశ ప్రదక్షణగా ఆలయ ప్రదిక్షణ చేశారు.  స్వామి, అమ్మవారికి దివ్య కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవానికి వందలాది మంది భక్తులు హాజరు అయ్యారు. ఆలయ చైర్మ¯ŒS జంపన భీమరాజు, ఈఓ బళ్ల నీలకంఠం ఏర్పాట్లను పర్యవేక్షించారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement