తిరుమలలో 9వ తేదీ నుంచి వరుణ యాగం | varuna yagam starts 9th september at parveti mandapam, says d sambasivarao | Sakshi
Sakshi News home page

తిరుమలలో 9వ తేదీ నుంచి వరుణ యాగం

Sep 4 2015 11:12 AM | Updated on Aug 25 2018 7:22 PM

తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లు ఆన్లైన్లో నేటి నుంచి విక్రయిస్తున్నట్లు టీటీడీ ఈవో డి.సాంబశివరావు వెల్లడించారు.

తిరుపతి : తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లు ఆన్లైన్లో నేటి నుంచి విక్రయిస్తున్నట్లు టీటీడీ ఈవో డి.సాంబశివరావు వెల్లడించారు. నవంబర్ 5వ తేదీ వరకు ఈ ఆన్లైన్ టిక్కెట్లు విక్రయిస్తామని తెలిపారు. శుక్రవారం తిరుపతిలో సాంబశివరావు విలేకర్లతో మాట్లాడుతూ... సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు పార్వేటి మండపంలో వరుణ యాగాలు నిర్వహిస్తామని చెప్పారు.

అలాగే బ్రహ్మోత్సవాల పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని చెప్పారు.  8 లక్షల లడ్డూలు అదనంగా నిల్వ ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డి. సాంబశివరావు వివరించారు. గతంతో పోలిస్తే తిరుపతిలో భక్తులు గదుల వినియోగం 109 శాతం పెరిగిందన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో తప్పిపోయిన వారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. దీనికి లాస్ట్ అండ్ ఫౌండ్ అని పేరు పెట్టినట్లు ఆయన విశదీకరించారు.

టీటీడీలో ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం అనుమతులు రావాల్సి ఉందని చెప్పారు. అయితే టీటీడీలో ఉద్యోగాలు అంటూ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు ఈ సందర్భంగా డి.సాంబశివరావు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement