జెడ్పీ చైర్‌పర్సన్‌కు యూటీఎఫ్‌ వినతి | utf leaders appeal to zp chairperson over pf accounts online process | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్‌పర్సన్‌కు యూటీఎఫ్‌ వినతి

Jun 14 2016 10:17 AM | Updated on Sep 2 2018 3:34 PM

జిల్లా పరిషత్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్ల ఆన్‌లైన్‌ ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని యూటీఎఫ్‌ ప్రతినిధులు కోరారు.

శ్రీకాకుళం: జిల్లా పరిషత్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్ల ఆన్‌లైన్‌ ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని యూటీఎఫ్‌ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.

పీఎఫ్‌ చెల్లింపుల్లో జాప్యం నివారించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పీఎఫ్‌ ఆన్‌లైన్‌ ప్రక్రియలో జాప్యం చేస్తున్న అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి చైర్‌పర్సన్‌ సానుకూలంగా స్పందించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, జిల్లా సహాధ్యక్షుడు బమ్మిడి శ్రీరామమూర్తి, జిల్లా కార్యదర్శి కేవీ శ్రీరామమూర్తి, జిల్లా నాయకుడు హనుమంతు అన్నాజీరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement