‘గ్రేడ్‌–2 పండిత్‌లను అప్‌గ్రేడ్‌ చేయాలి’ | Upgrade Grade-2 Pandiths | Sakshi
Sakshi News home page

‘గ్రేడ్‌–2 పండిత్‌లను అప్‌గ్రేడ్‌ చేయాలి’

Jul 24 2016 10:31 PM | Updated on Sep 19 2019 8:59 PM

వీరన్నపేట (మహబూబ్‌నగర్‌) : ఉన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్ల (ఎస్‌ఏ) కు బదులు తెలుగు, హిందీ, ఉర్దూలో గ్రేడ్‌–2 పండిత్‌లతోనే ప్రభుత్వం పని చేయించుకుంటోందని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిట్‌ పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీష్‌ ఆరోపించారు.

వీరన్నపేట (మహబూబ్‌నగర్‌) : ఉన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్ల (ఎస్‌ఏ) కు బదులు తెలుగు, హిందీ, ఉర్దూలో గ్రేడ్‌–2 పండిత్‌లతోనే ప్రభుత్వం పని చేయించుకుంటోందని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిట్‌ పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీష్‌ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. వెంటనే గ్రేడ్‌–2 పండిత్‌లను అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. సంఘం రాష్ట్ర మహిళా ప్రతినిధి అనురాధ మాట్లాడుతూ జీఓ 11, 12లను సవరించి పదోన్నతులు కల్పించాలని, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో భాషా పండిత్‌లు, పీఈటీలను నియమించాలన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈనెల 30న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టే మహాధర్నాకు జిల్లా నుంచి పండిత్‌లు, పీఈటీలు పెద్దఎత్తున తరలిరావాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రతినిధి రాకేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణాచార్యులు, విజయ్‌కుమార్, లింగం, శాంతారెడ్డి, జగన్మోహన్‌గౌడ్, వాడెన్న తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement