విషమంగా వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్ల ఆరోగ్యం | Unconsciousness by ysrcp counselor in Inmates at nagari | Sakshi
Sakshi News home page

విషమంగా వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్ల ఆరోగ్యం

Mar 16 2016 7:44 PM | Updated on May 29 2018 3:40 PM

నగరిలో సమస్యల సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చేపట్టిన ఆమరణ దీక్షలో బుధవారం అపశ్రుతి చోటుచేసుకుంది.

తిరుపతి: చిత్తూరు జిల్లా నగరిలో సమస్యల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  కౌన్సిలర్లు ఆరోగ్యం క్షీణిస్తోంది. దీక్ష చేస్తున్న కౌన్సిలర్ గౌరీ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న ఆమె బుధవారం సాయంత్రం ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయారు. దీంతో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ఈటీటీ ప్లాంట్లను తక్షణమే ప్రారంభించాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సోమవారం నుంచి ఆమరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్ష చేస్తున్న కౌన్సిలర్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో తక్షణమే సమస్యలు పరిష్కారించడానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement