ఎస్‌ఆర్‌ఐటీకి యూజీసీ గుర్తింపు | UGC recognized SRIT College | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌ఐటీకి యూజీసీ గుర్తింపు

Jul 26 2016 11:52 PM | Updated on Sep 4 2017 6:24 AM

ఎస్‌ఆర్‌ఐటీకి యూజీసీ గుర్తింపు

ఎస్‌ఆర్‌ఐటీకి యూజీసీ గుర్తింపు

శ్రీనివాస రామానుజన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల (ఎస్‌ఆర్‌ఐటీ)కి అరుదైన గుర్తింపు లభించింది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) 12–బీ స్థాయి నైపుణ్యాలున్న కళాశాలగా గుర్తించింది.

జేఎన్‌టీయూ/బుక్కరాయసముద్రం: శ్రీనివాస రామానుజన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల (ఎస్‌ఆర్‌ఐటీ)కి అరుదైన గుర్తింపు లభించింది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) 12–బీ స్థాయి నైపుణ్యాలున్న కళాశాలగా గుర్తించింది. జిల్లాలో యూజీసీ గుర్తింపు  ఉన్న ఏకైక కళాశాలగా ఎస్‌ఆర్‌ఐటీ ఆవిర్భవించింది. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో 118  జేఎన్‌టీయూ అనుబంధ ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రమాణాలు, నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నట్లు యూజీసీ 33 కళాశాలలను గుర్తించింది. ఈ జాబితాలో ఎస్‌ఆర్‌ఐటీ చేరినట్లయింది.  
 
నాణ్యమైన విద్యా బోధనతో గుర్తింపు :  
రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల కరెస్పాండెంట్‌ ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడారు. ఎస్‌ఆర్‌ఐటీ కళాశాలలో విద్యార్థులకు అధునాతన సౌకర్యాలు కల్పనతో పాటు అత్యుత్తమ విద్యా భోదన అందిస్తున్నామన్నారు. ప్రతి ఏటా వందలాది మందికి క్యాంపస్‌ ఇంటర్వూల్లో ఎంపికవుతున్నారన్నారు. కార్యక్రమంలో  కళాశాల సీఈఓ జగన్మోçßæన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌  సుబ్బారెడ్డి  పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement