వడదెబ్బకు ఇద్దరు మృత్యువాత | Two died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు ఇద్దరు మృత్యువాత

Apr 29 2016 4:50 PM | Updated on Sep 3 2017 11:03 PM

వరంగల్ జిల్లాలో వడెదెబ్బ కారణంగా శుక్రవారం ఇద్దరు మృతి చెందారు.

వరంగల్ జిల్లాలో వడెదెబ్బ కారణంగా శుక్రవారం ఇద్దరు మృతి చెందారు. నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన కొలిపాక రజిత (35) గురువారం కూలీ పనులకు వెళ్లి అస్వస్థతకు గురైంది. వాంతులు అవుతుండడంతో స్థానికంగానే వైద్య చికిత్స ఇప్పించారు. పరిస్థితి విషమించడంతో ఆమె శుక్రవారం మృతి చెందింది. ఆమెకు భర్త సత్తయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో ఘటనలో ఏటూరు నాగారం మండలం గూడరేవుల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బూషయ్యగౌడ్ వడదెబ్బకు గురై శుక్రవారం మృతి చెందాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement