దండేపల్లిలో వడదెబ్బకు ఇద్దరి మృతి | Two died from sunstroke | Sakshi
Sakshi News home page

దండేపల్లిలో వడదెబ్బకు ఇద్దరి మృతి

Apr 24 2016 11:02 AM | Updated on Aug 17 2018 2:53 PM

అదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలో వడదెబ్బకు ఇద్దరు మృతిచెందారు.

అదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలో వడదెబ్బకు ఇద్దరు మృతిచెందారు. మండల కేంద్రానికి చెందిన పొదిల పున్నమ్మ(55) వడగాల్పుల ధాటికి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతిచెందింది. ఇదే మండలంలోని వెలగనూరు గ్రామానికి చెందిన మానం రాయబోసు(60) వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement