
రెండు బాల్య వివాహాలకు బ్రేక్
మండలంలో ని కోనాపూర్‌లో శుక్రవారం పోలీసులు బాల్య వివాహాన్ని అడ్డుకోగా, వారి రాకను గమనించిన వధూవరులు పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయారు.
కోనాపూర్‌లో అడ్డుకున్న పోలీసులు
రామాయంపేట: మండలంలో ని కోనాపూర్‌లో శుక్రవారం పో లీసులు బాల్య వివాహాన్ని అడ్డుకోగా, వారి రాకను గమనిం చిన వధూవరులు పెళ్లి మండ పం నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రిక్షా కార్మికుడు భీమ య్య, పెంటమ్మ దంపతుల కూ తురు వివాహం శుక్రవారం గ్రామంలోని ఫంక్షన్ హాలులో జరిపించడానికి నిర్ణయించారు. దానికోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వధూవరులతోపాటు ఇ రువర్గాల బంధువులు బాజాభజం త్రీలతో పెళ్లి మండపానికి చేరుకున్నారు.
కాసేపట్లో పెళ్లి తంతు ప్రారంభమవుతుందనగా స్థానిక ఎస్‌ఐ ప్రకాశ్‌గౌడ్, శిక్షణలో ఉన్న ఎస్‌ఐ పరుశరాం తమ సి బ్బందితో కలిసి మండపానికి చేరుకున్నారు. దీంతో అయోమయానికి గురైన వధూవరులతోపాటు వారి బంధువులు కొందరు పోలీసుల కంటపడకుండా అ క్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో వ ధూవరుల కోసం చూసిన పోలీసులు ఇరు కుటుంబాలకు చెందిన వారికి కౌ న్సెలింగ్ ఇచ్చి వెనుదిరిగారు. ఈ సందర్భంగా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి కైలాస్ మాట్లాడుతూ బాల్య వివాహం చట్టరీత్యా నేరమన్నారు.
ముస్లాపూర్‌లో అడ్డుకున్న అధికారులు
అల్లాదుర్గం: బాలికకు పెళ్లి చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ సంఘటన మండలంలోని ముస్లాపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. తహసీల్దార్ చక్రవర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముస్లాపూర్‌కు చెందిన మున్నూరు మంజుల, మల్లేశం దంపతుల కూతురు (15)కు మే 1న పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. బాలికకు వివాహం చేస్తున్నట్లు సమాచారం రావడంతో ముస్లాపూర్ వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.18 ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలని, బాలికకు వివాహం చేస్తే తల్లిదండ్రులపై, పెళ్లి కుమారుడు తల్లిదండ్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెళ్లి చేయబోమని, 18 ఏళ్లు నిండిన తర్వాతే చేస్తామని బాలిక తల్లిదండ్రులతో రాయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శివకుమార్, వీఆర్‌ఓ శారద, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రత్నమాల తదితరులు పాల్గొన్నారు.