గంపలగూడెం మండలం వినగడప పంచాయతీ లంబాడీతండాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది.
గంపలగూడెం మండలం వినగడప పంచాయతీ లంబాడీతండాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన రాజశేఖర్(14), తిరుపతి రావు(12) అనే ఇద్దరు బాలురు నీటి గుంటలో పడి మృతిచెందారు. ఒకరి రక్షించబోయి మరొకరు మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.