టీఆర్‌ఎస్‌తో కలిస్తే ఐఎస్‌ఐతో కలసినట్టే | TTDP MLA Revanth Reddy Fires On TRS Govt | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌తో కలిస్తే ఐఎస్‌ఐతో కలసినట్టే

Feb 10 2017 2:42 AM | Updated on Aug 29 2018 7:31 PM

టీఆర్‌ఎస్‌తో కలిస్తే ఐఎస్‌ఐతో కలసినట్టే - Sakshi

టీఆర్‌ఎస్‌తో కలిస్తే ఐఎస్‌ఐతో కలసినట్టే

టీఆర్‌ఎస్‌తో కలిస్తే ఐఎస్‌ఐ ఏజెంటుతో కలసినట్టేనని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌తో కలిస్తే ఐఎస్‌ఐ ఏజెంటుతో కలసినట్టేనని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి కుట్రలు చేసే ఐఎస్‌ఐతో కలసి పనిచేయడం, తెలంగాణ ప్రజల జీవన విధ్వంసానికి పాల్పడుతున్న సీఎం కేసీఆర్‌తో కలసి పనిచేయడం ఒక్కటేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో అసలైన ఉద్యమకారులు ఆస్తులను, ప్రాణాలను, ఉద్యోగాలను పోగొట్టుకుంటే కేసీఆర్‌ మాత్రం మీడియా హౌజులు, ఫాంహౌజులు పెట్టుకుని వేలకోట్ల రూపాయలను సంపాదించుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో అలవికాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, తెలంగాణకు పట్టిన చీడపురుగు అని వ్యాఖ్యానించారు. దొరలకు, దొర గడీలకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల పక్షాన ఆవిర్భవించిన టీడీపీ, అదే లక్ష్యంతో కేసీఆర్‌పై పోరాడుతుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement