'సమ్మె'ను విజయవంతం చేయాలి | trying for labour strike success | Sakshi
Sakshi News home page

'సమ్మె'ను విజయవంతం చేయాలి

Sep 1 2016 9:10 PM | Updated on Sep 4 2017 11:52 AM

పటాన్‌చెరు పట్టణంలోని శ్రామిక్‌భవన్‌లో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.

  • వైఎస్సాఆర్‌ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు నర్ర భిక్షపతి
  • పటాన్‌చెరు టౌన్‌: పటాన్‌చెరు పట్టణంలోని శ్రామిక్‌భవన్‌లో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సాఆర్‌ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు నర్ర భిక్షపతి మాట్లాడుతూ కార్మిక సమస్యలు, సామాన్యుల ఇబ్బందులు, నిత్యావసర సరుకుల ధర నియంత్రణ కోసం అన్నీ పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను  విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

    ప్రజలు, వ్యాపారవేత్తలు, కార్మికులు స్వచ్ఛదంగా  బంద్‌లో పాల్గొనాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నాయని, దీంతో సామాన్యులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. కార్పోరేటర్‌ శక్తులకు కొమ్ముకాసే విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు, కనీసం నిత్యవసర సరుకుల ధరలను కూడా నియంత్రించలేకపోవడం సిగ్గుచేటన్నారు. 

    శుక్రవారం సెప్టెంబర్‌ 2న చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెలో అంతా స్వచ్ఛదంగా పాల్గొని విజయవంతం చేయాలని, ఈ నిరసనతో కేంద్ర ప్రభుత్వం దిగిరావాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు మల్లికార్జున, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొలుకూరి నర్సింహారెడ్డి టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement