breaking news
labour unions strike
-
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆందోళన
-
'సమ్మె'ను విజయవంతం చేయాలి
వైఎస్సాఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు నర్ర భిక్షపతి పటాన్చెరు టౌన్: పటాన్చెరు పట్టణంలోని శ్రామిక్‌భవన్‌లో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సాఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు నర్ర భిక్షపతి మాట్లాడుతూ కార్మిక సమస్యలు, సామాన్యుల ఇబ్బందులు, నిత్యావసర సరుకుల ధర నియంత్రణ కోసం అన్నీ పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు, వ్యాపారవేత్తలు, కార్మికులు స్వచ్ఛదంగా బంద్‌లో పాల్గొనాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నాయని, దీంతో సామాన్యులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. కార్పోరేటర్ శక్తులకు కొమ్ముకాసే విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు, కనీసం నిత్యవసర సరుకుల ధరలను కూడా నియంత్రించలేకపోవడం సిగ్గుచేటన్నారు. శుక్రవారం సెప్టెంబర్ 2న చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెలో అంతా స్వచ్ఛదంగా పాల్గొని విజయవంతం చేయాలని, ఈ నిరసనతో కేంద్ర ప్రభుత్వం దిగిరావాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు మల్లికార్జున, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొలుకూరి నర్సింహారెడ్డి టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడ వాహనాలు అక్కడే...
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా బుధవారం కార్మిక సంఘాలు బంద్ చేపట్టాయి. దీంతో ప్రజా రవాణ పూర్తిగా స్తంభించింది. బస్సులు, ఆటోలు సహా అన్నిరకాల ప్రజారవాణ వాహనాలు నిలిచిపోయాయి. బీఎంఎస్ మినహా దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. లారీ ఓనర్ల అసోసియేషన్, ఆటో కార్మిక సంఘాలు కూడా బంద్‌కు మద్దతివ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. కార్మిక వ్యతిరేక విధానాలు, రహదారి రవాణ భద్రత బిల్లు ఉపసంహరించుకోవాలని, కార్మికుల కనీస వేతనాలు 15వేల రూపాయలు డిమాండ్ చేస్తూ..కార్మిక సంఘాలు ఈ బంద్ చేపట్టాయి. బంద్‌లో భాగంగా హైదరాబాద్‌లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హయత్‌నగర్ డిపో కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... డిపో ఎదుట నిరసనకు దిగారు. మెదక్‌లోనూ కార్మికుల రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. రోడ్డుపై తిరుగుతున్న ప్రైవేట్ వాహనాలను సైతం అడ్డుకున్నారు. -
ఎక్కడ వాహనాలు అక్కడే...