టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ ఘనవిజయం | TRS MPTC success | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ ఘనవిజయం

Sep 10 2016 8:26 PM | Updated on Sep 4 2017 12:58 PM

ఖేడ్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విజయోత్సవ ర్యాలీ

ఖేడ్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విజయోత్సవ ర్యాలీ

నారాయణఖేడ్‌ మండల పరిధిలోని జగన్నాథ్‌పూర్‌ ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఆభ్యర్థి మాణిక్యం ఘనవిజయం సాధించారు.

  • 115 ఓట్లతో గెలిచిన జగన్నాథ్‌పూర్‌ ఎంపీటీసీ మాణిక్యం
  • ఖేడ్‌ అభివృద్ధికి ప్రజాతీర్పే నిదర్శనం: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
  • నారాయణఖేడ్‌: నారాయణఖేడ్‌ మండల పరిధిలోని జగన్నాథ్‌పూర్‌ ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఆభ్యర్థి మాణిక్యం ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నర్సింలుపై మాణిక్యం 115 ఓట్ల మెజారిటీతో  గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.  కాంగ్రెస్‌ అభ్యర్థికి 490 ఓట్లు రాగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 605, టీడీపీ అభ్యర్థికి 36 ఓట్లు వచ్చాయి. 7 ఓట్లు నోటాకు 7 పోలయ్యాయి.  

    టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విజయోత్సావం
    ఎంపీటీసీగా మాణిక్యం గెలుపొందడంతో టీఆర్‌ఎస్‌ నాయకులు నారాయణఖేడ్‌తో పాటు బాణాపూర్‌, అంత్వార్‌, జగన్నాథ్‌పూర్‌ గ్రామాల్లో  సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఖేడ్‌ ఎమ్మెల్యే  భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారన్నారు.

    ఖేడ్‌ను అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రజల తీర్పే నిదర్శనమన్నారు. అంతకు ముందు ఖేడ్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు బాణాసంచా పేల్చి విజయోత్సవ సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రభాకర్‌, సిద్దయ్య స్వామి, చెనబస్సప్ప, పండరియాదవ్‌, మలిశెట్టియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement