రాంనారాయణ సేవలు మరువలేనివి | trs leader Dhulipala rannarayana died | Sakshi
Sakshi News home page

రాంనారాయణ సేవలు మరువలేనివి

Feb 25 2017 11:15 PM | Updated on Aug 9 2018 4:48 PM

టీఆర్‌ఎస్‌ మండల సీనియర్‌ నాయకుడు, దివంగత నేత ధూళిపాల రాంనారాయణ దుగ్గేపల్లి గ్రా మాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి,

త్రిపురారం : టీఆర్‌ఎస్‌ మండల సీనియర్‌ నాయకుడు, దివంగత నేత ధూళిపాల రాంనారాయణ దుగ్గేపల్లి గ్రా మాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్‌రావులు అన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన రాంనారాయణ విగ్రహాన్ని శుక్రవారం  వారు ఆవిష్కరించి మాట్లాడారు. గ్రామంలో బడి, గుడితో పాటు రైతుల ప్రయోజనాలను దృష్టి ఉంచుకొని ఎత్తిపోతల ఏర్పాటుకు రాంనారాయణ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. గ్రామంలో బస్‌షెల్టర్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించి దానికి రాంనారాయణ పేరు పెట్టేలా చూస్తామన్నారు.

టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సిం హయ్య మాట్లాడుతూ రాంనారాయణ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ, అణగారిన వర్గాల ప్రజల కోసం నిరంతరం శ్రమించారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తియాదవ్, ఎంపీపీ ధూళిపాల ధనలక్ష్మి రామచంద్రయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అనుముల శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ బుసిరెడ్డి అంజమ్మ అంజిరెడ్డి, రాంనారాయణ భార్య వెంకటమ్మ, సోదరులు సత్యనారాయణ, రాంచంద్రయ్య, గోవర్ధన్, అల్లుడు పులిజాల విష్ణుకుమార్, నాయకులు ఇస్లావత్‌ రాంచందర్‌నాయక్, భరత్‌రెడ్డి, ధన్‌సింగ్‌నాయక్, జానకీరామయ్య చౌదరి, నూకల వెంకట్‌రెడ్డి, అనుముల అనంతరెడ్డి, అనుముల రఘుపతిరెడ్డి, పెద్దబోయిన శ్రీనివాస్‌యాదవ్, మేడారపు మట్టయ్య, అనుముల సుధాకర్‌రెడ్డి, జంగిలి శ్రీనివాస్‌యాదవ్, జొన్నలగడ్డ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement