మిత్రసేన భౌతికకాయానికి ప్రముఖుల నివాళి | Tributes to Former MLA Mitrasena | Sakshi
Sakshi News home page

మిత్రసేన భౌతికకాయానికి ప్రముఖుల నివాళి

Feb 14 2016 2:11 PM | Updated on Oct 3 2018 7:38 PM

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన మృతదేహానికి ప్రముఖులు ఆదివారం నివాళులు అర్పించారు.

అశ్వారావుపేట : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన మృతదేహానికి ప్రముఖులు ఆదివారం నివాళులు అర్పించారు. మండలంలోని సున్నంబట్టిలో ఉంచిన మిత్రసేన భౌతికకాయాన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పీసీసీ కార్వనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, సున్నంరాజయ్య, తాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయితా సత్యం, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున మిత్రసేన కిమ్స్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement