ట్రై సైకిల్‌ పంపిణీ | tri cycle donates | Sakshi
Sakshi News home page

ట్రై సైకిల్‌ పంపిణీ

Sep 24 2016 10:49 PM | Updated on May 29 2018 5:25 PM

ట్రై సైకిల్‌ పంపిణీ - Sakshi

ట్రై సైకిల్‌ పంపిణీ

మండలంలోని మామిడిమాకులపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి అనే వికలాంగునికి హిందూపురం నియోజక వర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ ట్రై సైకిల్‌ అందజేశారు.

లేపాక్షి : మండలంలోని మామిడిమాకులపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి అనే వికలాంగునికి హిందూపురం నియోజక వర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ ట్రై సైకిల్‌ అందజేశారు. ఇటీవల మండలంలోని మామిడిమాకుపల్లి గ్రామంలో జరిగిన గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమంలో వికలాంగుడు తటస్థ పడి తనకు ట్రై సైకిల్‌ అందజేయాలని నవీన్‌నిశ్చల్‌ను కోరారు.

ఆయన వెంటనే స్పందించి అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం చిలమత్తూరుకు వెళ్తూ లేపాక్షి ఆర్టీసీ బస్టాండు ఆవరణలో లక్ష్మీనారాయణరెడ్డికి ట్రైసైకిల్‌ అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ నారాయణస్వామి, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు నారాయణస్వామి, కౌన్సిలర్‌ నాగభూషణరెడ్డి, స్థానికులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement