breaking news
tri cycle donates
-
ఎంపీ మేకపాటి సేవలు అభినందనీయం
సాక్షి,నెల్లూరు రూరల్ : నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సేవలు అభినందనీయమని, ఆయన చొరవతో రూరల్ నియోజకవర్గంలో 68 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లను అందజేసినట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. స్థానిక కొండాయపాళెం రోడ్డులోని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ కార్యాలయంలో మంగళవారం ఎంపీ నిధులతో సమకూర్చిన ఐదు బ్యాటరీ ట్రైసైకిళ్లను దివ్యాంగులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ మేకపాటి చొరవతో సాధ్యమైందన్నారు. ఒక్కో ట్రైసైకిల్ విలువ రూ.37 వేలు ఉంటుందని, ఇందులో ఎంపీ గ్రాంట్ కింద రూ.12 వేలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో రూ.25 వేలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా గత నాలుగేళ్లుగా దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికారులు, ప్రభుత్వ సహకారాలతో 500 మంది దివ్యాంగులకు చేయూత నిచ్చామన్నారు. సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. విలువలకు కట్టుబడిన ఎంపీ మేకపాటి దివ్యాంగుల బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఆహ్వానించామని, అయితే తాను ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీగా రాజీనామా చేశానని, స్పీకర్ ఆమోదించినా, ఆమోదించకున్నా తాను ఎంపీని కానని, అందుకే నైతికంగా ఈ కార్యక్రమానికి హాజరుకావడం ధర్మం కాదని, అలాగని దివ్యాంగులకి ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఆగకూడదని, దానిని వెంటనే జరపించాలని ఎంపీ కోరినట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఇంతటి నైతిక విలువలకు విశ్వసనీయతకు కట్టుబడ్డ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆదర్శం హర్షణీయమని, అందరికీ మార్గదర్శకమని కొనియాడారు. -
ట్రై సైకిల్ పంపిణీ
లేపాక్షి : మండలంలోని మామిడిమాకులపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి అనే వికలాంగునికి హిందూపురం నియోజక వర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ట్రై సైకిల్ అందజేశారు. ఇటీవల మండలంలోని మామిడిమాకుపల్లి గ్రామంలో జరిగిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో వికలాంగుడు తటస్థ పడి తనకు ట్రై సైకిల్ అందజేయాలని నవీన్‌నిశ్చల్‌ను కోరారు. ఆయన వెంటనే స్పందించి అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం చిలమత్తూరుకు వెళ్తూ లేపాక్షి ఆర్టీసీ బస్టాండు ఆవరణలో లక్ష్మీనారాయణరెడ్డికి ట్రైసైకిల్ అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నారాయణస్వామి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నారాయణస్వామి, కౌన్సిలర్ నాగభూషణరెడ్డి, స్థానికులు ఉన్నారు.