గిరిజన వలసల నివారణలో ప్రభుత్వం విఫలం | traibles problems | Sakshi
Sakshi News home page

గిరిజన వలసల నివారణలో ప్రభుత్వం విఫలం

Oct 1 2016 10:47 PM | Updated on Sep 4 2017 3:48 PM

గిరిజన వలసల నివారణలో ప్రభుత్వం విఫలం

గిరిజన వలసల నివారణలో ప్రభుత్వం విఫలం

ఏజెన్సీ నుంచి ఉపాధి కోసం వలస వెళుతున్న గిరిజన కూలీలు ఎక్కువగా చనిపోతున్నారని, అలాంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైఎస్సార్‌ సీపీ యుజవజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌ (అనంత బాబు) డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే రాజేశ్వరి, వైఎస్సార్‌ సీపీ నేతల అనంతబాబు
జడేరు (గంగవరం ) :
ఏజెన్సీ నుంచి ఉపాధి కోసం వలస వెళుతున్న గిరిజన కూలీలు ఎక్కువగా చనిపోతున్నారని, అలాంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైఎస్సార్‌ సీపీ యుజవజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌ (అనంత బాబు) డిమాండ్‌ చేశారు. గంగవరం మండలం జడేరుకు చెందిన అల్లం శివశంకర్‌ రెడ్డి (25) ఉపాధి కోసం కోయంబత్తూర్‌ వెళ్లి  గత నెలలో ఆకస్మికంగా మృతి చెందాడు. ఆ కుటుంబాన్ని రాజేశ్వరి, అనంత బాబు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారుlమాట్లాడుతూ ఏజెన్సీ గ్రామాల నుంచి వలసలను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ ప్రాంతంలో సరైన పనులు లేక గిరిజన కుటుంబాలు వలసలు పోయి, ఇతర ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు వారి వెంట ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement