పున్నమి ఘాట్‌లో ఏర్పాట్లను డీజీపీ సాంబశివరావు ఆదివారం పరిశీలించారు.
విజయవాడ: పున్నమి ఘాట్‌లో ఏర్పాట్లను డీజీపీ సాంబశివరావు ఆదివారం పరిశీలించారు. ట్రాఫిక్ ఆంక్షలను పరిస్థితులను బట్టి సడలిస్తున్నామని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఐడీ కార్డులు కలిగిన మీడియాను, వెహికల్స్‌ను అనుమతించాలని డీజీపీ పేర్కొన్నారు. అధికారులు పుష్కర ఘాట్ వద్దకు తమ వాహనాల్లో బంధువులను అధిక సంఖ్యలో తీసుకురాకుండా పోలీసులకు సహకరించాలని డీజీపీ సూచించారు.