సినీ హీరోయి¯ŒS కాజల్ అగర్వాల్ ఈ నెల 4న కాకినాడ వస్తున్నారు. ప్రపంచ కేన్సర్ డే సందర్భంగా సూర్య గ్లోబల్ హాస్పటల్‌లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఉదయం 7 గంటలకు భానుగుడి జంక్ష¯ŒSలోని చార్మినార్ టీ సెంటర్ నుంచి
రేపు కాజల్ అగర్వాల్ రాక
Feb 2 2017 10:56 PM | Updated on Aug 17 2018 2:34 PM
కాకినాడ :
సినీ హీరోయి¯ŒS కాజల్ అగర్వాల్ ఈ నెల 4న కాకినాడ వస్తున్నారు. ప్రపంచ కేన్సర్ డే సందర్భంగా సూర్య గ్లోబల్ హాస్పటల్‌లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఉదయం 7 గంటలకు భానుగుడి జంక్ష¯ŒSలోని చార్మినార్ టీ సెంటర్ నుంచి జేఎ¯ŒSటీయూ వరకు జరిగే కేన్సర్ అవగాహన ర్యాలీలో ఆమెతో పాటు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని హాస్పటల్ చైర్మ¯ŒS డాక్టర్ బీహెచ్‌పీఎస్ వీర్రాజు గురువారం సాయంత్రం విలేకరులకు చెప్పారు. ర్యాలీ అనంతరం జేఎ¯ŒSటీయూ సమీపంలోని ఎగ్జిబిష¯ŒS గ్రౌండ్స్‌లో జరిగే కేన్సర్ వ్యాధి అవగాహన సదస్సులో కేన్సర్ వ్యాధి చికిత్స నిపుణులతోపాటు కాజల్ అగర్వాల్ కూడా ప్రసంగిస్తారన్నారు. కేన్సర్‌కు వైద్యం చేయించుకుని పదేళ్ళ తరువాత కూడా ఆనందమయజీవితం గడుపుతున్న వారి అనుభవాలను అదే వేదికపై తెలుసుకుంటారన్నారు. అనంతరం మాధవపట్నంలో సూర్య గ్లోబల్ హాస్పటల్‌లో కేన్సర్ వ్యాధిగ్రస్తులను కాజల్ పరామర్శించి పండ్లు పంపిణీ చేస్తారని చెప్పారు.
Advertisement
Advertisement